Home

చల్ చల్ గుర్రం


చల్ చల్ గుర్రం చలాకి గుర్రం
కర్రతో చేసిన గజ్జెల గుర్రం
మువ్వలు మెడలో ముద్దుగ గట్టీ
రంగుల హంగుల సింగారించి
వీపుకు జీను సాపుగ వేసి
వదిలేస్తే సరి పరుగిడు గుర్రం
కళ్ళెం చేత్తో గట్టిగ బట్టి
గుర్రం మీద కూర్చొని యుండీ
చల్ చల్ చల్ మని తోలుతు వుంటే
గంతులు వేయుచు పరుగిడు గుర్రం
చల్ చల్ గుర్రం చలాకి గుర్రం
Read On 0 comments

తారంగం తారంగం


తారంగం తారంగం
తాండవ కృష్ణ తారంగం
వేణూ నాథా తారంగం
వెంకట రమణా తారంగం
వెన్నెల దొంగా తారంగం
చిన్నీ కృష్ణా తారంగం
Read On 0 comments

Taarangam Taarangam

This poem is on Lord Krishna


Taarangam Taarangam
Tandava Krishna Taarangam
Venunaadha Taarangam
Venkata Ramana Taaragam
Chinni Krishna Taarangam
Venna Donga Taarangam
Taarangam Taarangam
Tandava Krishna Taarangam

Read On 0 comments

చుక్ చుక్ రైలు


చుక్ చుక్ రైలు వస్తోంది
దూరం దూరం జరగండి
ఆగినాక ఎక్కండి
జో జో పాపాయి ఏడవకు
లడ్డు మిఠాయి తినిపిస్తా
చల్లని పాలు తాగిస్తా
Read On 0 comments

చప్పట్లమ్మ తాళాలు


చప్పట్లమ్మ తాళాలు
దేవుడి గుళ్ళో బాజాలు
పళ్లు పాలు దేవుడికి
పాలు చెక్కర పాపాయికి
Read On 0 comments

Chuk Chuk Railu

This poem is about Train

Chuk Chuk Railu Vastondi
Dooram Dooram Jaragandi
Aagi Naaka Ekkandi
Jo Jo Papayi Edavaku
Laddu Mittai Tinipistaa
Challani Paalu Taagistaa

Read On 0 comments

Chappatlu Tallalu

While reciting this poem, babies are taught to clap hands.

Chappatlamma Tallalu
Devudi gullo bhajalu
Pallu paalu Devudiki
Paalu chekkara Papayiki
Read On 0 comments